Global Vaartha
Date of Publish : 24/10/2026, 3:29 pm
Editor : భవ్య జర్నలిస్ట్

‘నీ తండ్రి ఇచ్చిన ఆస్తిని చెల్లెలికి ఎందుకివ్వవు’.. జగన్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు 

 మీడియాతో మాట్లాడుతూ.. ‘నోరు ఉంది.. వేసుకోవడానికి పేపర్ ఉంది.. అందుకని వాగితే సరిపోతుంది. నువ్వు తప్పు చేయకపోతే 500 సార్లు వాయిదాలు ఎందుకు అడిగావు. మీ తండ్రి ఇచ్చిన ఆస్తిని నీ చెల్లెలికి ఎందుకు ఇవ్వవు? చివరికి ఆస్తి కోసం తల్లిని కోర్టుకు ఈడ్చావు.. నీ గురించి ఎవరికి తెలియదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ తండ్రి బెంగళూరులో యలహంక ప్యాలెస్‌లో ఇద్దరికీ(అన్నాచెల్లెలు) ఇల్లు కట్టించారని, చివరకు మేనకోడలి పెళ్లి కూడా ఆపే కంస మామగా మారారంటూ సీఎం విరుచుకుపడ్డారు. అదేమిటని ప్రశ్నిస్తే ఆయనకు భద్రత సమస్య అని నంగనాచి కబుర్లు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ‘అతను ఎటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అని చెప్పేందుకే ఇవన్నీ చెబుతున్నాను. లేని పక్షంలో వాళ్ల కుటుంబం గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ ఒక విద్యార్థిగా వివాదాస్పద చరిత్ర ఉంది. కొడుకుగా అతని పరిస్థితి ఏంటో రోశయ్య చెప్పారు. అతని అరాచకాలు భరించలేక బెంగుళూరు పంపారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో రోశయ్య చెప్పారు’ అని గుర్తుచేశారు. అన్నగా అతను బాబాయ్‌ను చంపేయించి చెల్లెలు సునీతను మనోవేదనకు గురిచేశారని అన్నారు. సొంత మేనకోడలి పెళ్లికి ఇల్లు ఇవ్వకుండా అన్నగా కూడా అతను ఫెయిల్ అయ్యారని విమర్శించారు. చివరకు ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని.. ఇప్పుడు ఒక పార్టీ నేతగా కూడా అరాచకాలు చేస్తూ ఫెయిల్ అయ్యారంటూ సీఎం చంద్రబాబు విమర్శించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save