Global Vaartha
Date of Publish : 24/10/2026, 3:32 pm
Editor : భవ్య జర్నలిస్ట్

సన్నవడ్లకు పెరిగిన డిమాండ్‌

  • ఇతర రాష్ట్రాలకు తరలింపు
  • రైతుల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు
  • ధాన్యం సేకరణపై దృష్టి
  • అంతర్రాష్ట్ర సరఫరాకు ప్రాధాన్యం

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక వరినాట్లు తక్కువగా వేశారు. యాసంగిలో కూడా వరి వేయవద్దని ప్రభుత్వం చెబుతుండడంతో సన్నరకం ధాన్యానికి డిమాండ్‌ పెరిగింది. మరో వైపు బియ్యం ధరలు పెరుగుతుండడంతో మిల్లర్లు, ప్రైవేట్‌ వ్యాపారులు ముందుగానే ధాన్యాన్ని సమకూ ర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సన్నవడ్లను నేరుగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతు న్నారు.వ్యాపారులు ధాన్యాన్ని కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేట, గుంటూరు, మండపేట, గుడివాడతో పాటు తెలంగాణలోని మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ, ఖమ్మం జిల్లాలకు తరలిస్తున్నారు.

ధాన్యం సేకరణపై దృష్టి

ఇటీవల మార్కెట్‌లో సన్న బియ్యానికి గిరాకీ పెరగడంతో వ్యాపారులు ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గతంలో రైతులు తమ ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్‌ లేదా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి విక్రయించేవారు. ప్రస్తుతం కొందరు వ్యాపారులు, మిల్లర్లు రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో రైతులకు కూడా శ్రమ, ధాన్యం తరలింపు ఖర్చులు తప్పుతున్నాయి.

అంతర్రాష్ట్ర సరఫరాకు ప్రాధాన్యం

సన్న బియ్యానికి తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ గిరాకీ ఉండడంతో ధాన్యం, బియ్యం వ్యాపారంలో అంతర్రాష్ట్ర సరఫరాకు ప్రాధాన్యం పెరుగుతోంది. మిల్లింగ్‌ అనంతరం బియ్యాన్ని ఇతర రాష్ట్రాల మార్కెట్లకు సరఫరా చేసే వ్యాపార అవకాశాలు ఉండడంతో వ్యాపారులు నాణ్య మైన సన్నవడ్ల సేకరణపై దృష్టి పెడుతున్నారు. జమ్మికుంట మండలంలో సుమారు 12వేల ఎకరాల్లో వరిసాగు చేయగా, సన్నవడ్లు దాదాపు 9వేల ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుత సీజన్‌లో పచ్చివడ్లు కేవీఎం-1638 క్వింటాల్‌కు రూ.3,300, జైశ్రీరామ్‌ క్వింటాల్‌కు రూ.4వేలు, బీపీటీ క్వింటాల్‌కు రూ.3,300, ఆర్‌ఎన్‌ఆర్‌ రూ.4వేల వరకు ధర ఉంది. మున్ముందు ధరలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే.



Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save