Global Vaartha
Date of Publish : 24/10/2026, 3:38 pm
Editor : భవ్య జర్నలిస్ట్

కమీషన్ల కోసం కక్కుర్తిపడి కాళేశ్వరం కట్టారు.. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు: మంత్రి ఉత్తమ్ కు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్ పార్టీ పదేపదే అబద్ధాలు చెబుతోందని నీటి పారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థను గత ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి దుయ్యబట్టారు.బీఆర్ఎస్ కమీషన్లకు కక్కుర్తి పడి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకుంది. ఉద్దేశపూర్వకంగానే ప్రాణహిత చేవెళ్ల నుంచి మేడిగడ్డకు మర్చారు. ప్రాజెక్ట్ వ్యయాన్ని 37వేల కోట్ల నుంచి లక్షన్నర కోట్లకు పెంచారు. వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ వాళ్ల హయాంలోనే కూలిపోయినా.. ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. సీతారామ ప్రాజెక్ట్ రీ డిజైన్ పేరిట 2వేల కోట్ల ప్రాజెక్ట్ వ్యయాన్ని 20 వేల కోట్లకు పెంచారు. అధిక వ్యయంతో నిర్మించినా సరే.. కనీసం ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చారా? జూరాల, దేవాదుల, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ పూర్తి చేసి ఉంటే ఈ రోజు ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై ఉండేది కాదు. రాష్ట్రంలో నీటి పారుదల రంగాన్ని కేసీఆర్ అండ్ కంపెనీ సర్వ నాశనం చేసింది. అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసం చేస్తు్న్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్ల ముందు జోసెఫ్ గోబెల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది’ అంటూ మంత్రి ఉత్తమ్ తీవ్రంగా విమర్శించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save