Global Vaartha
Date of Publish : 24/10/2026, 3:49 pm
Editor : భవ్య జర్నలిస్ట్

స్థానిక ఎన్నికలను ఆపేందుకు 59 పిటిషన్లు.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

  • ఏపీని పునర్నిర్మించాం.. బ్రాండ్ ఇమేజ్ పెంచాం..
  • క్రిమినల్ మనస్తత్వంతోనే అల్లర్లు..
  • పథకం ప్రకారమే హింస..

ప్రభుత్వ పనితీరుపైనే ప్రజలు తీర్పు ఆధారపడి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. రౌడీయిజం, నేరాలు చేసే వారిని ఎవరు హర్షించరన్నారు. పదేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు next levelకు వెళ్లాయని తెలిపారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని నేను కంట్రోల్ చేశా.. నా లైఫ్‌ను కూడా రిస్క్ పెట్టి మరీ చేశాను’ అని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో నెల రోజుల పాటు కర్ఫ్యూ ఉందని.. అప్పట్లో తాను సీఎంగా ఉన్నప్పుడు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. అప్పటి నుంచి హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని చెప్పుకొచ్చారు.

• ఏపీని పునర్నిర్మించాం.. బ్రాండ్ ఇమేజ్ పెంచాం..

ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వస్తే అధిగమించి వెళ్లామని ముఖ్యమంత్రి అన్నారు. 2019 నుంచి 2024 వరకు ఏపీలో అరాచకం రాజ్యమేలిందని సీఎం విమర్శించారు. ఎన్ని రకాల అరాచకాలు చేయాలో అన్నీ చేశారన్నారు. తనకు కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇటువంటి అరాచకాల వల్లే 2024లో ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారన్నారు. చివరకు గొడ్డలి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోపెట్టారని తెలిపారు. ఏపీని పునర్నిర్మాణం చేశామని.. బ్రాండ్ ఇమేజ్ పెంచామని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. రాయలసీమ రైజింగ్, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వంటి అంశాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 96 కేంద్ర పథకాలకు వచ్చిన నిధులను మళ్లించారని.. తాము వచ్చాక వాటిని సరిదిద్దామని వెల్లడించారు. స్థానిక ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం 16వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులు రావన్నారు. అవి రాకపోతే స్థానిక సంస్థల్లో అభివృద్ధి జరగదని వివరించారు.

క్రిమినల్ మనస్తత్వంతోనే అల్లర్లు..

స్థానిక ఎన్నికలు ఆపాలని 59 పిటిషన్లు వేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లను అమలుచేశామన్నారు. ఎక్కడ బీసీలు ఉంటే అక్కడ బీసీలకు సీట్లు ఇచ్చామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తున్నామని.. కరవును సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్నారు. ఇవి చేసుకుంటూ పోతుంటే వైసీపీ అడ్డుపడుతుందని.. గత రెండున్నరేళ్లలో వీళ్లు జిల్లాలకు వెళ్లి అరాచకాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డారని.. SIR వచ్చిన తర్వాత ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్లారని ఫైర్ అయ్యారు. వాళ్లకు ఉన్న క్రిమినల్ మనస్తత్వంతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించారని అన్నారు. సాక్షాత్తు ఒక ఎంపీ వాహనాలను పంపి టీడీపీ కార్యకర్తలను తొక్కించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

పథకం ప్రకారమే హింస..

ఏపీలో అనేక ప్రాంతాలలో ఒక పథకం ప్రకారం హింస సృష్టించారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే.. పంజాబ్ నుంచి క్రిమినల్స్, మారణాయుధాలు తీసుకువచ్చి అరాచకం చేశారన్నారు. దర్శిలో వైసీపీ చేసిన అరాచకం, పోలీసులపై జరిపిన దాడిని ప్రజలు అందరూ చూశారన్నారు. పులివెందుల, పుంగనూరు, రాయచోటి, దర్శి వంటి పలు ప్రాంతాలలో జరిగిన అరాచకాలు కూడా ప్రజలకు తెలియాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు


Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save