శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలం శ్రీపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనకనుంచి బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు. మృతులు శ్రీకాకుళం గుజరాతి పేటకు చెందిన తిప్పన పార్వతి, రామారావుగా గుర్తించారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.