Global Vaartha
Date of Publish : 24/10/2026, 6:39 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పోలియో రహిత సమాజమే మన లక్ష్యం

  • పోలియోకు టీకా – ప్రతి చిన్నారికి రక్షణ

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పులివెందుల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ అండ్ టూ ఆధ్వర్యంలో డాక్టర్ బి శ్రీనివాసులు అధ్యక్షతన విద్యార్థులలో పోలియోపై అవగాహన కల్పించి విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడం జరిగినది వైస్ ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ యు శ్రీనిత ఈ కార్యక్రమంలో పోలియో వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, నివారణ చర్యలు, టీకాల ప్రాముఖ్యత గురించి వివరించారు.పోలియో ఒక వైరస్‌ ద్వారా వ్యాపించే అంటువ్యాధి. ఇది ముఖ్యంగా చిన్నపిల్లల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి శాశ్వత వైకల్యానికి కారణమవుతుంది. పోలియోను నివారించడానికి టీకాలు అత్యంత ముఖ్యమైనవి. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు ప్రభుత్వం సూచించిన షెడ్యూల్ ప్రకారం పోలియో టీకాలు వేయించాలి.
ఈ ఏడాది ప్రపంచ పోలియో దినోత్సవం అక్టోబర్ 24న నిర్వహిస్తున్నారు. 2026 థీమ్‌గా “One day, one focus: Ending polio for good” ఈ సందర్భంగా పోలియో నిర్మూలనకు కృషి చేస్తున్న వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకుల సేవలను అభినందించారు.
భారతదేశం 2014లో పోలియో రహిత దేశంగా ధృవీకరణ పొందినప్పటికీ, పిల్లలందరికీ టీకాలు అందించడం, వ్యాధి పర్యవేక్షణ కొనసాగించడం అవసరమని కేంద్ర ఆరోగ్య మంత్రి సూచించారు.
పోలియోకు టీకా – ప్రతి చిన్నారికి రక్షణ; పోలియో రహిత సమాజమే మన లక్ష్యం!”
ఈ కార్యక్రమంలో ఎన్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థినిలు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save