Global Vaartha
Date of Publish : 24/10/2026, 6:42 pm
Editor : భవ్య జర్నలిస్ట్

కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి

  • పులివెందులలో కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం
  • మాజీ జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి

కూటమి అభ్యర్థులకు పులివెందుల ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని, ఇంటింటా ప్రచార కార్యక్రమాలలో
మాజీ జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి వార్డు ప్రజలు అభ్యర్థిస్తూ ప్రచార కార్యక్రమాలు కొనసాగించారు. శనివారం,పులివెందుల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్ అభ్యర్థి తూగుట్ల గీత కుమారి, కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పులివెందుల మాజీ జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి మహిళా అభ్యర్థులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save