Global Vaartha
Date of Publish : 24/10/2026, 9:20 pm
Editor : భవ్య జర్నలిస్ట్

వంగవీటి పేరును శాశ్వతంగా చెరిపేసే స్కెచ్ వేసిన చంద్రబాబు .. పవన్ కళ్యాణ్ !

  • మేయర్ గా నన్ను .. కార్పోరేటర్లుగా కూటమి అభ్యర్ధులని గెలిపించండి .. నేనే అసలైన కూటమి మేయర్ అభ్యర్థిని ..
  • అసలు గత రెండు వారాలుగా విజయవాడలో ఏమి జరుగుతుంది. ?

వంగవీటి రాధా జనసేన లోకి ఎందుకెళ్ళాడు ? డైరెక్ట్ గా టీడీపీ నుండే పోటీ చేయొచ్చు కదా ? చంద్రబాబు చెప్తే పవన్ కాదంటాడా ? మరి దీని వెనుకున్న స్కెచ్ ఏమిటి ?
జాగ్రత్తగా గమనిస్తే ... చంద్రబాబుకి పూర్తిగా పవన్ దాసోహం అయ్యాడనే అసంతృప్తి మెల్లమెల్లగా కాపులలో అధికమవుతుంది ..
కాపులకి తానొక్కడే ఏకైక ప్రతినిధిగా ఉండాలని . . తనకి కులంలో ఇంకో పవర్ సెంటర్ ఉండకూడదనేది పవన్ భావన ..
మొదటినుండీ వంగవీటి అంటే పవన్ కి గిట్టదు .. నాకంటే కాపులలో ఇంకెవరో గొప్పవాళ్ళు అంటే పవన్ అహం దెబ్బతింటుంది ..
* గతంలో వంగవీటి రంగా ఆఫ్ట్రాల్ ఒక వీధి రౌడీ * అని పవన్ స్వయంగా కామెంట్ చేసాడు ..
మొదటినుండీ వంగవీటి అనే పేరు తనకి కంటిలో నలుసులా ప్రతిసారీ ఇబ్బంది పెడుతుంది .. అదే సమయంలో ఇదే ఇబ్బంది తెలుగుదేశానికి కూడా ఉంది ..
కాపులలో పెరుగుతున్న అసంతృప్తి వాదులంతా వంగవీటి పేరుతో రాధా చుట్టూ చేరి కూటమికి వ్యతిరేకంగా తయారైతే .. అటు పవన్ కి ..ఇటు చంద్రబాబుకి ఇద్దరికీ తీవ్ర నష్టం జరుగుతుంది ..
అందుకోసమే ఈ స్కెచ్ వేశారు ..
రాధాని టీడీపీ నుండి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడని .. అలా గెలిస్తే విజయవాడలో మరో పవర్ సెంటర్ గా మారతాడని .. ఒకవేళ టీడీపీ తరుపున పోటీ చేయించి మనమే ఓడగొడితే .. రాజధానిలోనే టీడీపీ వోడిపోయింది .. ఇక జగన్ వచ్చేస్తున్నాడనే మెసేజ్ వెళ్తే ..పార్టీ పరంగా అది .మరింత నష్టమని .. అది వ్యక్తిగతంగా చంద్రబాబుకి , పవన్ కి ఇద్దరికి నష్టమని భావించారు .
అలా కాకుండా జనసేన తరుపున పోటీ చేయించి ఓడిస్తే .. అటు చంద్రబాబుకి .. ఇటు పవన్ కి ఇద్దరి చేతులకి మట్టి అంటకుండా .. వంగవీటి పేరుని శాశ్వత సమాధి చేయొచ్చు ..
అందుకే రాధాని జనసేనలోకి పంపి అక్కడనుండి పోటీ చేయిస్తున్నారు ..
నిజానికి జనసేనలోకి వస్తానని రాధా అడగలేదు .. రమ్మని పవన్ కూడా అడగలేదు ..
అంతకముందు ఎమ్మెల్యే గా ఓడిపోయాడు .. ఇప్పుడు మేయర్ గా ఓడిపోయాడు .. వంగవీటి పేరుకు జనాలలో ఎలాంటి విలువ లేదనే మెసేజ్ అందరికి పంపాలి ..
కాపులకే ఒకడే నాయుకుడు పవన్ కళ్యాణ్ .. ఆయన పేరు ఒక్కటే వినపడాలి .
ఆ ఒక్కడిని తమ చేతిలో పెట్టుకొంటే .. కాపులందరూ మనచేతిలో ఉన్నట్లే .. ఇది వీళ్ళ స్కెచ్ .
మొత్తం స్క్రిప్ట్ రాసింది చంద్రబాబు .. అమలు చేసింది పవన్ కళ్యాణ్ ..
వంగవీటి అనే ఎమోషన్ ని శాశ్వతంగా వదిలించుకోవడానికి చంద్రబాబు పవన్ కలిసికట్టుగా చేసిన కుట్ర ఇది .

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save