Global Vaartha
Date of Publish : 24/10/2026, 9:31 pm
Editor : భవ్య జర్నలిస్ట్

జడ్పీటీసీ అభ్యర్థులుగా పుత్తా నరసింహారెడ్డి, రాజేశ్ రెడ్డి నామినేషన్లు

  • కడప జడ్పీ పీఠంపై ఉత్కంఠ.. సీనియర్, జూనియర్‌లో టికెట్ ఎవరికి?
  • జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం కోసం తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠ నెలకొంది.

జడ్పీ చైర్మన్‌ అభ్యర్థిత్వం ఎవరిని వరిస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో సీనియర్‌ నేత పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు రాజేశ్‌ రెడ్డి జడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.
కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి తండ్రి, టీడీపీ సీనియర్‌ నేత పుత్తా నరసింహారెడ్డి చెన్నూరు, వీరపునాయునిపల్లె మండలాల నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్లు వేశారు.
మరోవైపు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు రాజేశ్‌ రెడ్డి జమ్మలమడుగు జడ్పీటీసీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు.
జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో టీడీపీ పావులు కదుపుతున్న తరుణంలో ఈ ఇద్దరు నేతల పేర్లు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సీనియర్‌ నేత పుత్తా నరసింహారెడ్డికి అవకాశం కల్పిస్తారా?
లేక యువ నాయకుడు రాజేశ్‌ రెడ్డి వైపు పార్టీ మొగ్గు చూపుతుందా?
అన్నది ఆసక్తికరంగా మారింది.
వీరిద్దరిలో పార్టీ అధిష్ఠానం ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది,
చివరకు జడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా ఎవరు నిలుస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save