Global Vaartha
Date of Publish : 24/10/2026, 10:11 pm
Editor : భవ్య జర్నలిస్ట్

చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు: రాజంపేట డిఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజంపేట డీఎస్పీ వెంకట రామయ్య హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నామినేషన్ పత్రాలను చింపడం, ఇతరులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. బైండోవర్ చేయించిన వ్యక్తులు హింసాత్మక ఘటనలకు పాల్పడితే వారిని రిమాండ్‌కు పంపిస్తామని ఆయన హెచ్చరించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save