Date of Publish : 24/10/2026, 10:29 pm
Editor : భవ్య జర్నలిస్ట్
శాంతిభద్రతలను కాపాడేందుకు ఎస్ఐ ఎన్. చంటిబాబు ఎన్నికల అవగాహన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
- కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎన్. చంటిబాబు ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు - 2026 నేపథ్యంలో మోటూరు ఎక్స్ రోడ్డు వద్ద ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఎన్నికల అవగాహన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
ఎన్నికల సమయంలో గొడవలు, ఘర్షణలకు పాల్పడటం వల్ల గ్రామంలో మరియు కుటుంబాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని పోలీసులు సూచించారు. ఎన్నికల పోటీల విషయంలో ఒకరితో ఒకరు గొడవలకు దిగకుండా, గెలుపోటములను ప్రజాస్వామ్య నిర్ణయంగా గౌరవించాలని, ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అవగాహన కల్పించారు.
అలాగే గొడవలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని ప్రజలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గుడివాడ రూరల్ పోలీసులు కోరారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.