Global Vaartha
Date of Publish : 24/10/2026, 10:37 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పోలింగ్ బూత్ స్థాయి నుంచి పటిష్టంగా పనిచేయాలి

  • మేయర్ అభ్యర్థి బండి దీప్తి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి: మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

కడప నియోజకవర్గంలోని మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా గారి నివాస కార్యాలయంలో ఈరోజు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు, సీఈసీ సభ్యులు కే. సురేష్ బాబు గారు, మేయర్ అభ్యర్థి బండి దీప్తి గారు, మాజీ మేయర్ పాకా సురేష్ గారు, SEC సభ్యులు మాసీమ బాబు గారు, యానాదయ్య గారు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ ఉమైర్ గారు తదితర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో పోలింగ్ బూత్ స్థాయి నుంచి ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్‌లో ప్రజలతో మమేకమవుతూ, పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. కడప నగర మేయర్ అభ్యర్థి బండి దీప్తి గారికి సుమారు 70 వేల ఓట్ల మెజార్టీ లక్ష్యంగా పనిచేయాలని నాయకులు కోరారు.

కడప నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాడుల సంస్కృతి చోటుచేసుకుంటోందని నాయకులు ఆరోపించారు. నగరంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలు తమ తీర్పు ద్వారా సమాధానం చెబుతారని పేర్కొన్నారు.

ఎప్పటికీ ఒకేలా ఉండవని, కళ్లు మూసి తెరిచేలోపే రెండేళ్ల కాలం పూర్తవుతుందని నాయకులు వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save