Global Vaartha
Date of Publish : 24/10/2026, 10:44 pm
Editor : భవ్య జర్నలిస్ట్

మహానటి పవిత్ర ..

ఆమె పేరు పవిత్ర .. పవిత్ర అంటే మహా పతివ్రత లాగా పవిత్రంగా ఉంటుందని , భర్త సేవలో తరించి, తపించి పోతుందని అనుకోవద్దు. చాలా నేర్పుగా ,చాలా తెలివిగా యూట్యూబ్ ఇతర సోషల్ మీడియాలో అన్ని పరిశీలించి పరిశోధించి , ఆలోచించి, కూల్ గా, సైలెంట్ గా చంపేసింది. ఎంత సైలెంట్ గా చంపినా , ఎక్కడో ఒక దగ్గర చిక్కకుండా ఉంటుందా..? అలా పోలీసులకు చిక్కి ప్రియుడితో సహా జైలు పాలు అయింది. మైసూర్ జిల్లా హోన్సూర్ లో 30 ఏళ్ల పవిత్ర తన ప్రియుడు సూర్యతో కలిసి 35 ఏళ్ల భర్త రాంప్రసాద్ ను దారుణంగా చంపింది. ఆమె ఉమ్మెత్త గింజల పొడిని భర్త ఇడ్లీ పిండిలో కలిపి పెట్టింది.. భర్తకు ఇడ్లీ పెట్టిన తర్వాత, ఉమ్మెత్త గింజల పొడిని పాలలో కలిపి ఇచ్చింది.. దానికి హార్లిక్స్ కూడా కలిపింది. భర్త బలహీనంగా ఉన్నాడని తెప్పించానని చెప్పి తాగించింది. ఆ తర్వాత అతనికి అనారోగ్యం రావడంతో విలవిలలాడి పోతూ పడిపోవడంతో గొంతు పిసికి చంపేసింది. బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చి మృత దేహాన్ని శవ పరీక్షకు పంపించారు. విషాహారం, గొంతు నులమడం వల్ల చనిపోయాడని నివేదిక వచ్చింది. దీంతో పవిత్రను, ప్రియుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save