Global Vaartha
Date of Publish : 25/10/2026, 10:30 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు.

కడప నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి మట్లి సువర్ణ గారి గెలుపును కాంక్షిస్తూ టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి 52వ డివిజన్‌లో ముమ్మర ప్రచారం నిర్వహించారు.
రవీంద్ర నగర్‌లోని కమల్ ఫ్యాన్సీ స్టోర్ వద్ద నుంచి ప్రచారాన్ని ప్రారంభించిన వారు, కూటమి శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. డివిజన్ పరిధిలోని సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడప నగర సమగ్రాభివృద్ధి, మెరుగైన డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల వంటి మౌలిక సదుపాయాల కల్పన మరియు స్వచ్ఛమైన పాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. కడప నగర రూపురేఖలు మార్చేందుకు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేసేందుకు కూటమి మేయర్ అభ్యర్థి మట్లి సువర్ణ గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save