రాబోయే తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రింది జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
🚨 🆘 అత్యవసర సహాయం కోసం సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్లు (SEOC):
📞 112 | 📞 1070 | 📞 1800 425 0101
🌪️ తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 🌪️
📌 తుపానుకు ముందు:
* ❌ పుకార్లను నమ్మవద్దు; ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు.
* 📱 అత్యవసర సమాచారం కోసం మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసి ఉంచుకోండి. విపత్తుల సంస్థ హెచ్చరిక SMSలను గమనించండి.
* 📻 రేడియో/టీవీ వార్తలు చూడండి, వార్తాపత్రికలు చదవండి.
* 📄 విలువైన పత్రాలు, సర్టిఫికెట్లను వాటర్ ప్రూఫ్ కవర్లలో భద్రపరుచుకోండి.
* 📦 అత్యవసర వస్తు సామగ్రిని (Emergency Kit) ముందే సిద్ధం చేసుకోండి.
* 🏠 ఇంటి పైకప్పును భద్రపరుచుకోండి, అవసరమైన మరమ్మతులు పూర్తి చేయండి.
* 🌊 వరదలు/ఉప్పెన ముప్పు ఉంటే వెంటనే ఎత్తైన, సురక్షితమైన ఆశ్రయ ప్రాంతానికి వెళ్లండి.
* 🍞 కనీసం ఒక వారానికి సరిపడా ఆహారం, తాగునీరు నిల్వ ఉంచుకోండి.
* 🚪 తలుపులు, కిటికీలను సురక్షితంగా మూసివేయండి.
* 🗣️ అధికారులు సూచించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లండి.
🏠 తుపాను సమయంలో (ఇంట్లో ఉంటే):
* 🔌 ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి; గ్యాస్ కనెక్షన్లను తొలగించండి.
* 🚪 తలుపులు, కిటికీలు మూసి ఉంచండి.
* 🏚️ ఇల్లు సురక్షితం కాకపోతే ముందే సురక్షిత షెల్టర్‌కు చేరుకోండి.
* 💧 కాచి చల్లార్చిన/క్లోరినేటెడ్ నీరు మాత్రమే తాగానండి.
* 🛡️ భవనం దెబ్బతినే సూచనలు ఉంటే బలమైన టేబుల్ లేదా బెంచ్ కింద మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
🚶♂️ తుపాను సమయంలో (బయట ఉంటే):
* 🚫 దెబ్బతిన్న లేదా పాత భవనాల్లోకి వెళ్లవద్దు.
* 🌳 చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఎప్పుడూ నిలబడవద్దు.
* ⚠️ గాలి తగ్గినా తుపాను ముగిసిందని అనుకోవద్దు; అధికారులు 'ఆల్ క్లియర్' ప్రకటించే వరకు వేచి ఉండండి.
🌤️ తుపాను తరువాత:
* 💧 కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగండి.
* 📢 అధికారిక సమాచారం వచ్చేవరకు షెల్టర్ వదిలి బయటకు/ఇంటికి వెళ్లవద్దు.
* ⚡ తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిన స్తంభాల పట్ల తీవ్ర జాగ్రత్త వహించండి.
* 🔌 దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రీషియన్ తనిఖీ చేసిన తర్వాతే వాడండి.
🎣 మత్స్యకారులు చేయవలసినవి:
* 🚫 సముద్రంలోకి వేటకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దు.
* 📱 మొబైల్ ఫోన్లను ఎప్పుడూ ఛార్జ్ చేసి ఉంచుకోండి.
* 📻 అదనపు బ్యాటరీలతో రేడియోను సిద్ధంగా ఉంచుకోండి.
* ⚓ పడవలు / తెప్పలను సురక్షితమైన ప్రాంతంలో బలమైన తాడుతో కట్టి ఉంచండి.
మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ