Global Vaartha
Date of Publish : 25/10/2026, 10:50 am
Editor : భవ్య జర్నలిస్ట్

జూపూడి కలిసిన జై భీమ్ రావ్ భారత్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మైనంపాటి ఏసురత్నం

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ, నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల అబ్జర్వర్ శ్రీ జూపూడి ప్రభాకరరావు గారిని జై భీమ్ రావ్ భారత్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మైనంపాటి యేసురత్నం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీ టీమ్ సభ్యులు తలారి వెంకటయ్య, రామిశెట్టి రఘునాథ్, జంగం తిరుపతయ్య, ఆమారి మల్యాద్రి, వట్టికాల ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జూపూడి ప్రభాకరరావు పర్యటన సందర్భంగా ఈ సమావేశం జరిగింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save