Global Vaartha
Date of Publish : 25/10/2026, 11:02 am
Editor : భవ్య జర్నలిస్ట్

విజయవంతంగా ‘ఆపరేషన్ ట్రైడెంట్‌’.. రూ.100 కోట్ల హవాలా గుట్టు రట్టు

దేశంలో మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై కేంద్రం పంజా విసిరింది. దాదాపు 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఆపరేషన్లు నిర్వహించి 18 మంది అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా సభ్యులను అరెస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే..
2029 డిసెంబర్ 31 నాటికి దేశాన్ని ‘డ్రగ్స్ రహిత భారత్’ గా రూపొందించాలనే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ చేపట్టిన ‘ఆపరేషన్ ట్రైడెంట్’ విజయవంతంగా ముందుకు సాగుతోంది. భారత్, మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా కొనసాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్‌ను పూర్తిగా తుడిచివేయడానికి ప్రభుత్వం ఈ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా మణిపూర్, అసోం, మిజోరం 3 రాష్ట్రాల్లోని 38 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. విజయవంతంగా కొనసాగిన ఈ ఆపరేషన్‌లో పోలీసులు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. రూ.100 కోట్ల హవాలా గుట్టును రట్టు చేసి 1,424 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. 18 మంది అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి 500 డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save