Global Vaartha
Date of Publish : 25/10/2026, 4:12 pm
Editor : భవ్య జర్నలిస్ట్

బంగాళాఖాతంలో వాయుగుండం.. గంటకు 5 కి.మీ వేగంతో..

ఆగ్నేయ, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 5 కి.మీ వేగంతో కదులుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎమ్ఏ) తెలిపింది. ప్రస్తుతానికి ఇది విశాఖకు 870 కి.మీ., కాకినాడకు 960 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని వివరించింది. ఇవాళ తీవ్ర వాయుగుండంగా, రేపు తుఫానుగా బలపడే అవకాశముందని హెచ్చరించింది. ఈ వాయుగుండం ఈ నెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడుతుందని, 28న అతి తీవ్ర తుఫానుగా మారుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
ఈనెల 28.. మధ్యాహ్నం నాటికి ఈ వాయుగుండం బాపట్ల- విశాఖ మధ్య తీరం దాటే అవకాశముందని ఏపీఎస్‌డీఎమ్ఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది తీరం దాటే సమయంలో గంటకు 115-125 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కోరారు. బీచ్‌లలో ఎగసిపడే అలలు వద్ద సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయరాదని చెప్పారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save