Global Vaartha
Date of Publish : 25/10/2026, 4:24 pm
Editor : భవ్య జర్నలిస్ట్

యువ నాయకుడు రెడ్డెప్పగారి శ్రావణ్ రాజ్ రెడ్డి జన్మదిన వేడుకలు

  • పాల్గొన్న టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి

కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యువ నాయకుడు రెడ్డెప్పగారి శ్రావణ్ రాజ్ రెడ్డి  జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
ఈ వేడుకల్లో టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి  పాల్గొని కేక్ కట్ చేయించారు. అనంతరం శ్రావణ్ రాజ్ రెడ్డి  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు యువజన విభాగ సభ్యులు పాల్గొని శ్రావణ్ రాజ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save