Global Vaartha
Date of Publish : 25/10/2026, 4:33 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పాలకుల దాష్టీకాలకు ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలి.

  • కష్టాలను ఎదుర్కొని ప్రజల కోసం పనిచేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి.
  • ఆధునిక రాచరిక పాలనను మరిపించిన నామినేషన్ల పర్వం.
  • అధికారం చేసిన అత్యాచారం నామినేషన్ల ఏకపక్ష తిరస్కరణలు.
  • దుశ్శాసన పర్వం నామినేషన్స్ వేయడానికి వచ్చిన మహిళలపై జరిగింది.
  • దొంగ దారిలో కూటమి ప్రభుత్వం ఏకగ్రీవాలు చేసుకోవడం ప్రజలు హర్షించరు.
  • రాజ్యాధికారం పాలకుల భోజ్జంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మారితే ప్రమాదం.
  • వైసిపి బాటలో టిడిపి అంటూ రెండు మాటల ఘనపాటీల వైఖరి ప్రజలు హర్షించరు.
  • మంచీ చెడ్డా జాంన్తా నై అంటున్న కూటమి పార్టీల తీరును ప్రజలు అంగీకరించరు.

సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్.

2026 అక్టోబర్ 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు, కడప స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేసిన సిపిఎం అభ్యర్థుల, సిపిఎం నాయకుల, కార్యకర్తల సమావేశం కామ్రేడ్ వి.అన్వేష్ అధ్యక్షతన జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ... బద్వేలు మున్సిపాలిటీ 21వ వార్డు కు, బ్రహ్మంగారిమఠం మండలం జడ్పిటిసికి, ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం ఎంపీటీసీకి, పొద్దుటూరు రూరల్ కొత్తపల్లె, గోపవరం ఎంపీటీసీలకు సిపిఎం అభ్యర్థులు ఎన్నికల బరిలో సిపిఎం అభ్యర్థులు ఉన్నారని, ఎలాంటి కష్టాల్లోనైనా ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తున్న, ప్రజల కోసమే నిస్వార్ధంగా పనిచేస్తూ జిల్లాలో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి నామినేషన్స్ వేయటానికి వెళ్లిన స్వతంత్ర, వామపక్షాల, చిన్న పార్టీల, ప్రతిపక్షాల అభ్యర్థులను వేయనీయకుండా ఎన్.డి.ఏ. కూటమి అధికార పార్టీల శ్రేణులు అడ్డుకుంటూ, దాడులు చేస్తున్న దాష్టీకాలకు ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నామినేషన్ల పర్వం ఏకపక్షంగా ఆధునిక రాచరిక పాలనను మరిపించిందని విమర్శించారు. అధికారం చేసిన అత్యాచారం ఏకపక్షంగా అధికార కూటమి పార్టీల యేతర నామినేషన్లు తిరస్కరణ అన్నారు. దుశ్శాసన పర్వం నామినేషన్స్ వేయడానికి వచ్చిన మహిళపై జరిగిందని ఆరోపించారు. దొంగ దారిలో కూటమి ప్రభుత్వం పార్టీలు ఏకిగ్రీవాలు చేసుకోవడం ప్రజలు ఎన్నటికీ హర్షించరని హెచ్చరించారు. రాజ్యాధికారం పాలకుల భోజ్జంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మారితే అది నియంతృత్వానికి, పౌర హక్కుల ఉల్లంఘనకు దారితీసి ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య, న్యాయబద్ధమైన జీవన విధానానికి ప్రమాదంగా మారుతుందని తెలిపారు. పాలక పార్టీల శ్రేణులు కూడా సమాజంలో భాగమేనని వారికి కూడా ప్రమాదం అంచులు తాకుతాయని తెలిపారు. వైసిపి బాటలోనే టిడిపి అంటూ కూటమి పార్టీలు బహిరంగంగా రెండు మాటల ఘనపాటీల వైఖర్లు ప్రజలు స్వీకరించరు అని వెల్లడించారు. మంచి చెడ్డా జాంన్తా నై అంటున్న అధికార పార్టీల కూటమి శ్రేణుల తీరును ప్రజలు తిరస్కరిస్తారని తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో మైనార్టీల ఇళ్ళులు, దుకాణాలు, ప్రార్థనా స్థలాలపై బుల్డోజర్ రాజకీయాలు అమలు చేస్తున్న బిజెపితో టిడిపి పొత్తు దేశ సమైక్యత, సమగ్రతలకు ముప్పు అన్నారు. పోలీసుల ముందే నామినేషన్స్ వేయటానికి వచ్చిన పాలక కూటమి పార్టీల యేతరులపై దాడులు యెత్తేచగా జరుగుతూ ఉంటే, ఎలక్షన్ కమిషన్ కెమెరాల పుట్టేజులు ఏమయ్యాయని, వాటి ఆధారంగా కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని వారు ప్రశ్నించారు. ఈ దౌర్జన్యాలను, అరాచకాలను నేటి జెడ్ జనరేషన్ విద్యావంతులైన యువగళాలు నిశీతంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నారని, ఢిల్లీ జంతర్ మంతర్ తరహా ఉద్యమాలు జిల్లా, నగర, పట్టణ, మండల స్థాయిలోనూ ప్రజల అసంతృప్తి వెల్లువలా ఏదో ఒకనాడు కట్టలు తెంచుకొని వస్తుందని, ఇప్పటికైనా రాజ్యాంగ వ్యవస్థలు, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, పాలక ప్రభుత్వాలతో సంబంధం లేకుండా రాజ్యాంగ ఆదేశాలనుసారం వ్యవహరించాలని వారు హితవు పలికారు. లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ నియంతృత్వ వ్యవస్థగా మారుతుందని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.రామ్మోహన్, జి.శివకుమార్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కే.శ్రీనివాసులు రెడ్డి, బ్రహ్మంగారిమఠం మండలం జడ్పిటిసి సిపిఎం అభ్యర్థి గండి సునీల్ కుమార్, ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం సిపిఎం ఎంపీటీసీ అభ్యర్థి కోనేటి నరసయ్య, సిద్ధవటం సిపిఎం నాయకులు సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save