Global Vaartha
Date of Publish : 25/10/2026, 5:18 pm
Editor : భవ్య జర్నలిస్ట్

రాజంపేట మున్సిపాలిటీ పీఠం టీడీపీ కైవసం: ఫలించిన చమర్తి జగన్ మోహన్ రాజు గారి వ్యూహం

రాజంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా కుమారి డాక్టర్ దొంతం గాయత్రి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మున్సిపల్ ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు. ఈ చారిత్రక పరిణామంతో రాజంపేట పురపాలక పీఠం పై తెలుగుదేశం పార్టీ తొలిసారిగా తన జెండాను ఎగురవేసింది.
మున్సిపాలిటీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోవడంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు వ్యూహాత్మక నాయకత్వం కీలక పాత్ర పోషించింది. పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో సమన్వయం చేస్తూ, రాజకీయ సమీకరణాలను పకడ్బందీగా నడిపించిన జగన్ మోహన్ రాజు సమర్థత ఫలితంగానే రాజంపేట లో మొదటిసారి మున్సిపాలిటీ పై పసుపు జెండా సగర్వంగా రెపరెపలాడింది.
ఈ గెలుపుతో రాజంపేట మున్సిపాలిటీకి మొట్టమొదటి టీడీపీ చైర్‌పర్సన్‌గా, అలాగే అత్యంత పిన్న వయస్కురాలైన (యంగెస్ట్) చైర్‌పర్సన్‌గా డాక్టర్ దొంతం గాయత్రి సరికొత్త రికార్డు సృష్టించారు. యువతకు, విద్యావంతులకు ప్రాధాన్యం కల్పిస్తూ చమర్తి జగన్ మోహన్ రాజు తీసుకున్న నిర్ణయం పార్టీ పట్టును మరింత పటిష్టం చేసిందని, ఆయన నాయకత్వంలో రాజంపేట పట్టణాభివృద్ధి వేగవంతం కానుందని స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save