Global Vaartha
Date of Publish : 25/10/2026, 5:32 pm
Editor : భవ్య జర్నలిస్ట్

లవంగాల నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా..!

  • సాధారణంగా లవంగాన్ని మసాలా దినుసుగా మాత్రమే భావిస్తారు. కానీ దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అవి..

పరిమాణంలో చిన్నగా ఉన్నా.. లవంగం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సాధారణంగా లవంగాన్ని మసాలా దినుసుగా మాత్రమే భావిస్తారు. కానీ దీనిలో అనేక ఔషధ గుణాలూ ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించటంలో, రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడతాయి. అందువల్లే లవంగాన్ని సంప్రదాయ వైద్యంలోనూ వినియోగిస్తారు. ఈ లవంగాలను నీటిలో కలిపి తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియ మెరుగుదల: చాలామంది రాత్రివేళ కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్య తగ్గించడానికి లవంగాల నీరు ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికరమైన ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి.
నోటి ఆరోగ్యం: లవంగాలలోని యూజినాల్ నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీనివల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.
నిద్రపై ప్రభావం: లవంగాల్లో ఉన్న ఔషధ గుణాలు శరీరాన్ని విశ్రాంతపరుస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. మంచి నిద్ర పట్టేలా చేస్తాయి. క్రమం తప్పకుండా లవంగాల నీటిని తాగడం ద్వారా గాఢ నిద్ర పడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ: లవంగాల నీరు రక్తంలో చక్కెరను నియంత్రించటంలో సహాయపడుతుంది. ఇది చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. అలాగే ఇన్సులిన్ పనితీరునూ మెరుగుపరుస్తుంది.
లవంగాల నీటిని తయారు చేసే విధానం ..
లవంగాల నీటిని సిద్ధం చేసుకోవడం చాలా సులభం. ఒక గిన్నెలో నీటిని వేడి చేసి, అందులో లవంగాలను వేయాలి. తరువాత 5 నుంచి 7 నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించాలి. దానిని కొద్దిగా చల్లారనిచ్చి.. వడకట్టాలి. అంతే లవంగాల నీరు రెడీ. దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం లేదా తేనెను కూడా కలుపుకోవచ్చు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save