Global Vaartha
Date of Publish : 25/10/2026, 6:13 pm
Editor : భవ్య జర్నలిస్ట్

సదరం పరీక్షలకు ఎన్నికల కోడ్ మినహాయింపు..!

  • అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

దివ్యాంగులకు సదరం వైకల్య నిర్ధారణ పరీక్షలు, ధ్రువపత్రాల జారీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ, దివ్యాంగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాధారణ సదరం పరీక్షల కోసం క్రమం తప్పకుండా సమయాలను కేటాయించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు.

సదరం ధ్రువపత్రాలు దివ్యాంగులకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ వైకల్య నిర్ధారణ పరీక్షలు పూర్తికాక లేదా ధ్రువపత్రాలు అందక ప్రభుత్వ ప్రయోజనాలు పొందడంలో ఆలస్యం ఎదుర్కొంటున్న వారికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందన్నారు.

దివ్యాంగులకు అవసరమైన సేవలు నిరంతరాయంగా అందించాలనే ఉద్దేశంతో సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగంగా.. సదరం పరీక్షల నిర్వహణకు ఎన్నికల నియమావళి నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ చేయపట్టాలని సూచించారు. కావున, సదరం వైకల్య నిర్ధారణ పరీక్షలు అవసరమైన అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

కావున అర్హులైన దివ్యంగులు.. సదరం పరీక్షల కోసం అందుబాటులో ఉండే సమయాలను తెలుసుకుని, సంబంధిత అధికారుల సూచనల మేరకు అవసరమైన పత్రాలతో ముందస్తుగా నమోదు చేసుకోవాలని కోరారు...

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save