Global Vaartha
Date of Publish : 25/10/2026, 6:16 pm
Editor : భవ్య జర్నలిస్ట్

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పులివెందులలో ఎన్నికల ప్రచారం..

  • మాజీ జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి

పులివెందుల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్ అభ్యర్థి తూగుట్ల గీత కుమారి, కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పులివెందుల మాజీ జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి పులివెందుల మున్సిపాలిటీ లోని 20వ వార్డులో కూటమి కౌన్సిలర్ అభ్యర్థి మునివర్ధన్ యాదవ్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save