Global Vaartha
Date of Publish : 25/10/2026, 8:40 pm
Editor : భవ్య జర్నలిస్ట్

నగిరిగుట్టలో టిడిపి కౌన్సిలర్ల అభ్యర్థుల గెలుపుకు చక్రం తిప్పిన నల్లగారి భాస్కర్ రెడ్డి

  • టిడిపి కౌన్సిలర్లు అభ్యర్థుల గెలుపే ధ్యేయం

జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో 30, 35 ,36, 37, నగిరిగుట్ట వార్డులలో ఏకగ్రీవం చేసేందుకు నల్లగారి భాస్కర్ రెడ్డి చక్రం తిప్పాడు. పులివెందుల వైయస్ కంచుకోటలో నగిరిగుట్టలో నాలుగు వార్డులు ఏకగ్రీవంగా చేసి చరిత్ర సృష్టించారు. 30 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఆయన సతీమణి నల్ల గారి అనురాధ పోటీ చేయగా పోటీ చేసిన ఇద్దరు వ్యక్తులను బీటెక్ రవి ఆదేశాలతో భాస్కర్ రెడ్డి తెలివితేటలతో వారిని ఎన్నికల్లో పోటీల్లోనే లేకుండా చేయడం జరిగింది. పులివెందులలో టిడిపి పార్టీ తరఫున నాలుగు ఏకగ్రీవం అవడం చరిత్రలోనే మొదటిసారి, ఇది సువర్ణ అధ్యాయంలో లిఖించే విజయమని ప్రజలు అంటున్నారు. వైయస్ కంచుకోటలో బీటెక్ రవి బాగా వేసి 20 వార్డులు ఏకగ్రీవం చేయడం చర్చనీయాంశంగా మారింది. జరగబోయే ఎన్నికల్లో 20 వార్డులలో ఇంకా ఎన్ని వార్డులు కూటమి గెలుచుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇన్ని వార్డులు ఏకగ్రీవంగారంతో ప్రజలు ఇదే చర్చగా గుసగుసలాడుతున్నారు. పులివెందుల కంచుకోట ను బద్దలు కొట్టేందుకు యువ నాయకుడు మా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) పులివెందులలో అడుగుపెట్టినప్పటి నుండి అన్ని విజయాలే సాధిస్తూ వస్తున్నాడని చెప్పవచ్చు. మొన్న జరిగిన జడ్పిటిసి ఉప ఎన్నికల్లో తన సతీమణి మా రెడ్డి లతా రెడ్డిని గెలిపించేందుకు చాయ్శక్తుల కృషి చేశారు. ఇప్పుడు పులివెందులలో చైర్మన్ అభ్యర్థి తూగుట్ల గీత కుమారిని గెలిపించేందుకు, 20 వార్డులలో కౌన్సిలర్లు అభ్యర్థులను ఆయన పులివెందులలో నిరంతరం ప్రచారాలు చేస్తూ వారిని బలపరుస్తూ ముందుకు నడుస్తూ వారిని నడిపిస్తున్నారు. పులివెందులలో ఎన్ని ఏకగ్రీవం కావడానికి గల కారణం ఏమిటి అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ నగిరిగుట్టలో నాలుగు వార్డులు ఏకగ్రీవం కావడం చరిత్ర తిరగరాసినట్లు అయింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save