Global Vaartha
Date of Publish : 25/10/2026, 8:42 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీల్లో చైతన్య హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ

  • రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలకు పలువురు విద్యార్థుల ఎంపిక

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో వేంపల్లె చైతన్య హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. కడప మున్సిపల్ స్టేడియం, పులివెందుల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో నిర్వహించిన బాస్కెట్‌బాల్, చెస్, ఖో-ఖో, అథ్లెటిక్స్‌ పోటీల్లో సత్తా చాటి రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.కడప మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన అండర్‌-14 బాస్కెట్‌బాల్‌ పోటీల్లో పి. ప్రణీత్‌, అభినవ్‌ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అదేవిధంగా అండర్‌-14 చెస్‌ విభాగంలోనూ చైతన్య హైస్కూల్‌ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై తమ ప్రతిభను చాటుకున్నారు.పులివెందుల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన అండర్‌-17 ఖో-ఖో పోటీల్లో మేఘనాథ్‌, తరుణ్‌ సాయి ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్‌ విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో బి. మైనావతి ప్రథమ స్థానం సాధించారు. 1,500 మీటర్ల పరుగు విభాగంలో బి. గౌతమ్‌ రెడ్డి, 400 మీటర్ల పరుగు విభాగంలో కాశేశ్వర్‌ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.విద్యార్థులు వివిధ క్రీడా విభాగాల్లో సాధించిన విజయాల పట్ల పాఠశాల చైర్మన్‌ బి. చక్రపాణి రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. చదువుతో పాటు క్రీడలకు కూడా పాఠశాలలో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మరిన్ని విజయాలు సాధించేలా అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు.విద్యార్థుల విజయాల పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, క్రీడా విభాగం సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. తదుపరి స్థాయి పోటీల్లోనూ విద్యార్థులు విజయాలు సాధించి పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save