Global Vaartha
Date of Publish : 25/10/2026, 8:56 pm
Editor : భవ్య జర్నలిస్ట్

స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు...

  • జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశాలు...

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు విస్తృతంగా ఎన్నికల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో ప్రజలతో మమేకమవుతూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, ఘర్షణలు, బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడరాదని పోలీసులు ప్రజలకు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు భయపడకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.

జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసుల నిఘా, భద్రతా చర్యలు కొనసాగుతాయని, ప్రజలందరూ పోలీసులకు సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా భాగస్వాములు కావాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save