కడప నగరంలోని సంగంపేట రాముల గుడి సమీపంలో 25.10.2026వ తేదీన సాయంత్రం సుమారు 05.10 గంటల సమయంలో షేక్ అలీ ఖలీద్ (30) అనే యువకుడిపై సయ్యద్ బాషా (30) అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం, గత కొంతకాలంగా ఇరువురి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాల కారణంగా సయ్యద్ బాషా, అలీ ఖలీద్‌ను కత్తితో కడుపులో పొడవడంతో అతనికి రక్తగాయాలయ్యాయి. దాడిని అడ్డుకునే క్రమంలో అలీ ఖలీద్ ఎడమ చేతికి, మాజీ కార్పొరేటర్ షేక్ షంషీర్ బాషా చేతికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడిన వారు కడప హోలిస్టిక్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనకు ఎటువంటి రాజకీయ సంబంధం లేదని, కేవలం వ్యక్తిగత కారణాలు మరియు గత విభేదాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ సంఘటనను రాజకీయాలకు ముడిపెట్టి అవాస్తవ ప్రచారాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేయడమైనది.
ఈ ఘటనపై కడప రెండవ పట్టణ యు/జి పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.