Global Vaartha
Date of Publish : 25/10/2026, 10:53 pm
Editor : భవ్య జర్నలిస్ట్

27, 28 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు- జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గారు

గుంటూరు నగర పాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం పరిధిలో ఈ నెల 27, 28 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ గారు ఆదేశించారు. శనివారం ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పోలింగ్ ఏర్పాట్లను కలెక్టర్ గారు సమీక్షించారు.

ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని, పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణలో ఎటువంటి ఆలస్యం లేకుండా చూడాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఓటర్లకు ఫోటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 26న ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో మైక్రో పరిశీలకులకు శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ కమిషనర్లు, ఆర్.డి.ఓలు, రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, రూట్ అధికారులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save