కడప నగరంలోని శ్రీశ్రీశ్రీ హోలీ స్టిక్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ కార్పొరేటర్ షంషీర్, ఖాలిద్ ను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మేయర్ అభ్యర్థి బండి దీప్తి,
కడప నగరంలో ఎన్నడూ చూడని ఘటనలు చోటుచేసుకుంటున్నాయని మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష అన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.
కడప నగరంలోని 41వ డివిజన్ నకాష్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
టీడీపీకి చెందిన వ్యక్తులు ఒక్కసారిగా షంషీర్, ఖాలిద్‌లపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం ప్రతి ఒక్కరి హక్కు. ప్రచార సమయంలో దాడులకు పాల్పడటం ఆందోళనకరం. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మాజీ ప్రజాప్రతినిధులకు, నాయకులకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి...అని మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష ఆందోళన వ్యక్తం చేశారు. కడప నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న దాడులపై పోలీసులు తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.