ఉదయం ప్రారంభంలో అమ్మకాల ఒత్తిడితో భారీ పతనాన్ని చవిచూసిన మార్కెట్లు, ఆ తర్వాత వేగంగా కోలుకుని లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ (Nifty 50) కనిష్ఠ స్థాయిల నుంచి కోలుకుని 22,688.00 పాయింట్ల వద్ద (సుమారు 0.39% లాభంతో) కొనసాగుతోంది. సెన్సెక్స్ (BSE Sensex) 73,405.29 పాయింట్ల వద్ద (సుమారు 0.38% లాభంతో) ట్రేడ్ అవుతోంది.
మార్కెట్ పుంజుకోవడానికి ప్రధాన కారణాలు
వ్యాల్యూ బయింగ్ (Value Buying) గత వారం మార్కెట్లు పడిపోవడంతో, తక్కువ ధరలకే లభిస్తున్న నాణ్యమైన షేర్లను కొనుగోలు చేయడానికి మదుపర్లు ముందుకు రావడం.
మరో వైపు, బ్రెంట్ క్రూడ్ ధర కొద్దిగా తగ్గడం కూడా ఊరటనిచ్చింది. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం గత శుక్రవారం FIIలు రూ. 887.65 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడం కూడా మార్కెట్లకు మద్దతుగా నిలిచింది. (Stock Market Recovery Today)