Global Vaartha
Date of Publish : 26/10/2026, 11:16 am
Editor : భవ్య జర్నలిస్ట్

పశ్చిమాసియా ఉద్రిక్తతల సెగ.. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 115 డాలర్లకు!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు సరఫరాపై తలెత్తిన ఆందోళనల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు మళ్లీ మండిపోతున్నాయి. సోమవారం (అక్టోబర్ 26) నాటికి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 115 అమెరికన్ డాలర్ల వద్దకు చేరింది. అయితే, ప్రస్తుతం కాస్త దిగివచ్చి 110 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.గడిచిన వారంలో ముడిచమురు ధరలు 5 శాతానికి పైగా పెరిగి, 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన $117.41కి చేరువయ్యాయి. డబ్ల్యూటీఐ (WTI Crude) బ్యారెల్ ధర $101 - $102 వద్దకు చేరింది.మరోవైపు, ఇరాన్ మద్దతుగల హౌతీ బలగాలు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలు, మౌలిక వసతులపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతుండటంతో భయాలు పెరిగాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని తమ రాయబార కార్యాలయానికి చెందిన అత్యవసరం కాని సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిందిగా అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది.కాగా, ఇటీవల జరిగిన డ్రోన్, క్షిపణి దాడుల కారణంగా పశ్చిమాసియా ప్రాంతంలో రోజుకు దాదాపు 30 లక్షల బ్యారెళ్ల శుద్ధి సామర్థ్యం దెబ్బతింది. ఇది ప్రపంచ ఇంధన ధరలు పెరగడానికి దోహదమవుతోంది.(Brent Crude Oil Price $115)

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save