Global Vaartha
Date of Publish : 26/10/2026, 11:58 am
Editor : భవ్య జర్నలిస్ట్

నెల్లూరును దేశంలోనే నంబర్‌ 1 నగరంగా తీర్చిదిద్దుతాం: మంత్రి నారాయణ

  • నారాయణ, కోటంరెడ్డి కష్టపడి పనిచేస్తున్నారు: ఎంపీ వేమిరెడ్డి

 రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసంలో కూటమి పార్టీల నేతలు కీలక సమావేశం నిర్వహించారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న ఫేక్ ప్రచారాలపై నేతల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరును దేశంలోనే నంబర్ 1గా నగరంగా తయారు చేస్తామని అన్నారు. గత టీడీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కొనసాగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో, ఇప్పుడు ఏమి జరుగుతుందో ప్రజలు బేరూజు వేసుకోవాలని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 5 శాతం మిగిలిపోతే, గత ప్రభుత్వం వాటినీ పూర్తి చేయలేదని విమర్శించారు. 2027 జూన్ 12 నాటికి నగరంలో UDG పనులు పూర్తిచేసి, దోమలులేని నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఖజానా ఖాళీ అయినా సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

నారాయణ, కోటంరెడ్డి కష్టపడి పనిచేస్తున్నారు: ఎంపీ వేమిరెడ్డి

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంత్రి నారాయణ పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎంతటి సమస్యనైనా పరిష్కరిస్తారని చెప్పుకొచ్చారు. నెల్లూరు అభివృద్ధికి నారాయణ, కోటంరెడ్డి కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. నగరంలో ఎక్కడికి వెళ్లినా ఎండ్ టూ ఎండ్ రోడ్లు, అద్భుతైన పార్కులు, క్లోజ్డ్ డ్రైనేజీ కనిపిస్తున్నాయని ఎంపీ తెలిపారు.

వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలు మానుకోవాలి: కోటంరెడ్డి

రూరల్ పరిధిలోని 36 డివిజన్లలో 8 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అనేక చోట్ల వైసీపీ అభ్యర్ధులు పోటీ నుంచి తప్పుకున్నారని..‌. డమ్మీ అభ్యర్థులే మిగిలారన్నారు. వైసీపీ నేతలు ఓటమి భయంతో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని... ఎవరెన్ని కుట్రలు చేసినా, కూటమి పార్టీలదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే హితవుపలికారు. కూటమి ప్రభుత్వంలో, నెల్లూరు నగరం అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తెలిపారు. అందరం సమష్ఠిగా పనిచేస్తున్నామని చెప్పారు. కూటమి పార్టీల విజయంతోనే నెల్లూరు అభివృద్ధి సాధ్యమని జనసేన నేత వేములపాటి అజయ్ అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save