Global Vaartha
Date of Publish : 26/10/2026, 12:29 pm
Editor : భవ్య జర్నలిస్ట్

Global Vaartha ePaper — Swarnandhra, 26/10/2026, Monday (Page 1) https://globalvaartha.com/epaper/20

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే హాలియాపూర్‌లో సోమవారం ఉదయం 10.15 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. తనపై ఉన్న పరువునష్టం కేసు విచారణ కోసం రాహుల్ తన కాన్వాయ్‌లో సుల్తాన్‌పూర్‌లో ఉన్నఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు వెళ్తున్నారు. కాన్వాయ్ ముందు వైపు కాంగ్రెస్ నేతకు చెందిన ఒక ప్రైవేటు వాహనం వెళుతోంది. ఆ వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక కాన్వాయ్‌లో వస్తున్న వాహనాల్లో ఐదు వెహికల్స్ ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఈ ఘటనలో పలువురు భద్రతా సిబ్బంది, పార్టీ కార్యకర్తలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కాన్వాయ్ మళ్లీ సుల్తాన్‌పూర్ వైపు తన ప్రయాణం ప్రారంభించిందని వెల్లడించారు. కాగా.. రాహుల్ విచారణ నేపథ్యంలో సుల్తాన్‌పూర్‌లోని కోర్టు ఆవరణలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగళూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ నాటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని స్థానిక బీజేపీ నేత విజయ్ మిశ్రా.. రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. 2018 ఆగస్టు 4న ఆయన ఈ కేసు దాఖలు చేశారు. 2023లో రాహుల్ ఈ కేసు విచారణకు హాజరై బెయిల్ పొందారు. ఈనెల 13న ఈ కేసులో తీర్పు వెలువరించాల్సి ఉండగా.. దానిని ఈనెల 26కు కోర్టు వాయిదా వేసింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save