Global Vaartha
Date of Publish : 26/10/2026, 12:39 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. పోస్టల్ బ్యాలెట్‌పై ఎస్‌ఈసీ కొత్త మార్గదర్శకాలు

మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ముద్రణపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్లలో అభ్యర్థుల పేర్ల ముద్రణకు సంబంధించి పాత నిబంధనలను ఎన్నికల సంఘం సవరించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులను మూడు కేటగిరీలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఇతర అభ్యర్థులుగా విభజించింది. పోస్టల్ బ్యాలెట్ ప్యానెల్‌పై అభ్యర్థి పేరు, పార్టీ పేరును మొదట తెలుగులో, కింద ఆంగ్లంలో ముద్రించాలని ఎస్‌ఈసీ సూచించింది.పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై ఎలాంటి ఎన్నికల గుర్తులు (సింబల్స్) ముద్రించరాదని ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది. ఏ రాజకీయ పార్టీకి చెందని స్వతంత్ర అభ్యర్థుల పేర్ల కింద తెలుగు, ఆంగ్లంలో (Independent) అని ముద్రించాలని పేర్కొంది. సాధారణ బ్యాలెట్ పత్రం, పోస్టల్ బ్యాలెట్ పత్రం రెండింటిలోనూ అభ్యర్థుల పేర్ల వరుసక్రమం ఒకే విధంగా ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) వెల్లడించింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save