Global Vaartha
Date of Publish : 26/10/2026, 1:52 pm
Editor : భవ్య జర్నలిస్ట్

వాల్మీకి, బోయల అభ్యున్నతికి కృషి.. పెనుకొండలో కాంస్య విగ్రహం ఏర్పాటు: మంత్రి సవిత

 పెనుకొండ టీడీపీ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంత్యోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి మంత్రి సవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ 2017లో జీవో ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుది అని అన్నారు. చరిత్రాత్మక రామాయణ గ్రంథాన్ని అందించిన మహానీయుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. వాల్మీకి రామాయణం భార్యాభర్తల బంధానికి, కుటుంబ బంధాలకు, నేటి సమాజానికి ఎంతో ఆదర్శమన్నారు.వాల్మీకి/బోయ కులస్తులకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపు సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని మంత్రి చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాల్మీకి, బోయలకు ప్రాధాన్యమిచ్చామన్నారు. వాల్మీకి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే అని తెలిపారు. పెనుకొండలో వాల్మీకి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు బీసీలకు అండగా నిలిచారన్నారు. బీసీల అభ్యున్నతే టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏ ఎన్నికలైనా టీడీపీకి, కూటమికి బీసీలు అండగా ఉంటూ వస్తున్నారని మంత్రి సవిత పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save