Global Vaartha
Date of Publish : 26/10/2026, 2:00 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఢిల్లీలో ప్రతి వ్యాపారికీ అండగా ఉంటానని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. ఢిల్లీ వ్యాపారుల బాధను అర్థం చేస

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో ప్రతి వ్యాపారికీ అండగా ఉంటానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. ఢిల్లీ వ్యాపారుల బాధను అర్థం చేసుకుంటున్నామని ఎక్స్‌లో ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మెట్రో సేవలను నిలిపివేసి, రహదారులను మూసివేసి, దేశ రాజధాని ఢిల్లీని దిగ్బంధం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఓటు చోరీ జరిగితే ఏదీ సురక్షితం కాదన్నారు. ‘మీ (వ్యాపారులు) దుకాణం, మీ పొదుపు, మీ పిల్లల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడతాయి. ఓటుచోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయనను తొలగిస్తే 30 సెకన్లలోనే ఆందోళనలు ఆగిపోతాయి’ అని రాహుల్ పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save