Global Vaartha
Date of Publish : 27/10/2026, 10:46 am
Editor : భవ్య జర్నలిస్ట్

రేషన్‌లో నిత్యావసర సరుకులు

  • జిల్లాలో 3,52,072 రేషన్‌కార్డులు..
  • చౌకధరల దుకాణాల ద్వారా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు
  • బియ్యంతో పాటు ఆరు రకాల వస్తువుల పంపిణీకి ప్రణాళిక
  • ఎల్‌నినో నేపథ్యంలో పేదలపై భారం పడకుండా చర్యలు
  • పెరిగిన ధరలు..
  • అధికారుల కసరత్తు
  • ముందస్తు నిల్వలపై దృష్టి..

రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. రేషన్‌ దుకాణాల ద్వారా ప్రస్తుతం అందిస్తున్న బియ్యానికి తోడు ఆరు రకాల నిత్యావసర వస్తువులను అందించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పెరిగిన నిత్యా వసర వస్తువుల ధరలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచు కొని నిత్యావసర సరుకులు అందిస్తే ఏ మేరకు ఆర్థికభారం పడుతుందనే వివరా లను సేకరిస్తున్నది. ప్రభుత్వం ఆరు రకాల నిత్యావసర సరుకులను అందిస్తే జిల్లాలో సుమారు. 3.52లక్షల రేషన్‌ కార్డు దారులకు లబ్ధి చేకూరనుంది.

జిల్లాలో 3,52,072 రేషన్‌కార్డులు..

జిల్లా వ్యాప్తంగా 2,52,072 వివిధ రేషన్‌ కార్డులున్నాయి. ఇందులో 10,27,397 మం ది సభ్యులున్నారు. కాగా జిల్లాలో ఆహార భద్రతా కార్డులు (ఎఫ్‌ఎస్‌సీ) 3,37,376 కార్డులుండగా 9,91,888మంది సభ్యులున్నారు. ఏఎఫ్‌ఎస్‌సీ కార్డులు 14,572 ఉండగా 35,367మంది సభ్యులున్నారు. 124ఏఏపీ కార్డులుండగా ఇందులో 142 మంది సభ్యులున్నారు. వీరికి సరిపడా పలు నిత్యావసర వస్తువులను రేషన్‌ దుకాణాల ద్వారా సరఫరా చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

పెరిగిన ధరలు..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎల్‌నినో పరి స్థితులతో వర్షాభావం కారణంగా అన్ని రకాల పంటల దిగుబడి తగ్గిపోయింది. ఇదే అదనుగా వ్యాపారులు నిత్యావసర సరుకుల కృతిమ కొరత సృష్టించి వాటి ధరలను అమాంతం పెంచుతున్నారు. ఇప్పటికే కిలో బియ్యం సుమారు వంద రూపాయలకు చేరువలో ఉంది. దాంతో పాటు కూరగాయలు, చక్కర, పప్పులు, ఇతర వంట సామాగ్రి ధరలు కూడా భగ్గుమంటున్నాయి. రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

అధికారుల కసరత్తు

ప్రస్తుత పరిస్థితుల్లో పేద ప్రజలపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రేషన్‌దుకాణాల ద్వారా ప్రస్తుతం ఇస్తున్న సన్నబియ్యంతో పాటు నిత్యావసర సరుకు లను కూడా ఇవ్వాలని ప్రభుత్వం యోచి స్తోంది. ఈ విషయమై ప్రణాళికలు రూపొందించాలని సబంధితశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. బియ్యంతో పాటు గోధుమ పిండి, కందిపప్పు, పామాయిల్‌, చక్కెర, చింతపండు, కారంపొడి వంటి నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరకు అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం, ప్రజలకు చేకూరే లబ్ధి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

ముందస్తు నిల్వలపై దృష్టి..

హైదరాబాద్‌లో ఇటీవల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చేపట్టిన సమీక్ష సమావేశంలో సరుకుల సేకరణ, పంపిణీ విధానంపై అధికారులను నివేదిక కోరినట్లు తెలుస్తోంది. దాదాపు 14నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు సేక రించాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటి సేకరణతో ప్రస్తుతం మార్కెట్‌లో పెరుగుతున్న ధరల నుంచి పేద, మద్య తరగతి కుటుంబాలకు ఉపశమనం కలగనుంది. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే ఆహార కొరతను సైతం అదిగమించేం దుకు ఈ విధానం ఉపయోగ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save