Date of Publish : 27/10/2026, 10:54 am
Editor : భవ్య జర్నలిస్ట్
హనుమ నేర్పిన నీతి.
- సాక్షాత్తు భగవంతుడిని కూడా ప్రశ్నించవచ్చా?
- ఎవరిని.. ఎలా అడగాలి?
- అన్న ప్రశ్నలకు హనుమంతుడు ఒక సమాధానంగా నిలుస్తాడు.
- సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు.
- సుగ్రీవుడి నివాస ప్రాంతం అది.
- తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు.
- మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు.
- ‘రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ! దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!’
- మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు.
- మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది.
- గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమృగాలు సంచరించే ఇలాంటి చోటుకు రారు’ అని ప్రశ్నిస్తాడు హనుమ.
- ప్రశ్న అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ.
- ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు.
- వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
- ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు.
- వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు.
- హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు..
- మనం కూడా మన సందేహాన్ని ప్రశ్నను కూడా గొప్పగా అడగ గలగాలి..
- జై హనుమాన్..
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.