Global Vaartha
Date of Publish : 27/10/2026, 10:59 am
Editor : భవ్య జర్నలిస్ట్

‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’.. కర్నూల్ సోలార్ ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు

కర్నూలులో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కర్నూలు జిల్లాలోని 2,400 ఎకరాలలో 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ మళ్లీ ఒక కీలక శక్తిగా అవతరిస్తుందనడానికి ‘SAEL’ సోలార్ ప్లాంట్ ప్రత్యక్ష నిదర్శనమని చెప్పుకొచ్చారు. ‘చెప్పాం.. చేస్తున్నాం’ (#CheppaamChestunnaam) అని, ఇచ్చిన మాట ప్రకారమే ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి చూపించామని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save