Global Vaartha
Date of Publish : 27/10/2026, 11:03 am
Editor : భవ్య జర్నలిస్ట్

పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలి: హోం మంత్రి అనిత ఆదేశం

రాష్ట్రంలో ఏ క్షణమైనా తీరప్రాంత ప్రజల తరలింపునకు పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉండాలని అధికారులను హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ఈ కేంద్రాల్లో స్వచ్ఛమైన తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు అందించాలని స్పష్టం చేశారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112 లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. మంగళవారం రాజధాని అమరావతిలో ఆర్నబ్ తుపానుపై వివిధ శాఖల అధికారులతో మంత్రి అనిత్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అతి తీవ్ర తుపాను ‘ఆర్నబ్’ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సన్నద్ధంగా ఉందని అన్నారు. విపత్తు నిర్వహణ సంబంధిత శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం మీతో ఉందని ఎటువంటి ఆందోళన పడవద్దని ఈ సందర్భంగా ప్రజలకు స్పష్టం చేశారు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు. ప్రజలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖ తదితర బృందాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని ప్రజలకు మంత్రి వంగలపూడి అనిత వివరించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save