Global Vaartha
Date of Publish : 27/10/2026, 11:12 am
Editor : భవ్య జర్నలిస్ట్

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. ప్రజలకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

విజయనగరం జిల్లాలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఈరోజు  అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకను తిరకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. సిరిమానోత్సం సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి దివ్య ఆశీస్సులపై అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఉత్తరాంధ్ర ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, భక్తుల కొంగుబంగారం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. విజయనగరం చారిత్రక- ఆధ్యాత్మిక వైభవానికి, సంస్కృతికి ప్రతీక శ్రీ పైడితల్లి అమ్మవారి వైభవ సిరిమానోత్సవం. అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save