Global Vaartha
Date of Publish : 27/10/2026, 11:16 am
Editor : భవ్య జర్నలిస్ట్

నవంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

నవంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

- నవంబర్ 2వ తేదిన తిరుమల నంబి ఉత్సవారంభం.

- నవంబర్ 4వ తేదిన శ్రీ మనవాళ మహామునుల ఉత్సవారంభం.

- నవంబర్ 8వ తేదిన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.

- నవంబర్ 11వ తేదిన తిరుమల నంబి శాత్తుమొర.

- నవంబర్ 13వ తేదిన నాగుల చవితి, తిరుమల శ్రీవారి పెద్దశేష వాహనం, శ్రీమనవాళ మహామునుల శాత్తుమొర.

- నవంబర్ 14వ తేదిన సేనైమొదలియార్ వర్ష తిరు నక్షత్రం.

- నవంబర్ 15న శ్రీవారి పుష్ప యాగానికి అంకురార్పణ, తిరుమంగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

- నవంబర్ 16వ తేదిన శ్రీవారి పుష్ప యాగం, అత్రి మహర్షి వర్ష తిరు నక్షత్రం, పిళ్లై లోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయ్ గై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

- నవంబర్ 19 వ తేదిన యాజ్ఞవల్క్య జయంతి.

- నవంబర్ 21వ తేదిన కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీ చక్రతీర్థ ముక్కోటి.

- నవంబర్ 24వ తేదిన శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర.

- నవంబర్ 25వ తేదిన తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save