Global Vaartha
Date of Publish : 27/10/2026, 11:52 am
Editor : భవ్య జర్నలిస్ట్

యువ క్రికెటర్ కల నెరవేర్చిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా యువ క్రికెటర్లకు అతడు స్ఫూర్తి. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడి అద్భుతమైన రికార్డులు, నిలకడైన బ్యాటింగ్‌, మైదానంలో పోరాట పటిమ ఎంతోమందిని క్రికెట్‌ వైపు ఆకర్షించాయి. కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టినా, ప్రాక్టీస్‌ కోసం నెట్స్‌కు వచ్చినా అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది. అతడిని ఒక్కసారైనా చూడాలని, అతడితో మాట్లాడాలని, ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని యువ ఆటగాళ్లు ఆశపడుతుంటారు. తాజాగా కోహ్లీ ఓ యువ క్రికెటర్ కల నెరవేర్చాడు.న్యూజిలాండ్‌తో నవంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్ కోసం కోహ్లీ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అక్కడే నెట్ బౌలర్‌గా ఉన్న ఓ యువ క్రికెటర్‌కు కోహ్లీని కలిసే అవకాశం వచ్చింది. తన అభిమాన క్రికెటర్‌ను దగ్గర నుంచి చూసిన ఆ యువ ఆటగాడి ఆనందానికి అవధులే లేవు. కోహ్లీ కోసం సమయం కేటాయించి.. భారత జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి అతడికి ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save