Global Vaartha
Date of Publish : 27/10/2026, 12:18 pm
Editor : భవ్య జర్నలిస్ట్

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓలో 22శాతం లిస్టింగ్ ప్రాఫిట్? రేపే లిస్టింగ్

 జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోలో షేర్లు పొందిన (Allotment) మదుపరులకు గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ఆధారంగా రేపు (లిస్టింగ్ రోజు) సుమారు 22 శాతం లాభం లభించే అవకాశం ఉంది. ఈ షేర్లు రేపు (అక్టోబర్ 28)న బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈ (NSE) లలో నమోదు (List) కానున్నాయి.

మదుపరులకు ఎంత లాభం రావచ్చు? (లాట్ కేటాయింపుల ఆధారంగా)

ఇష్యూ ధర, GMP: ఒక షేరు అప్పర్ ప్రైస్ బ్యాండ్ ధర రూ.1,119 ఉండగా, ప్రస్తుత గ్రే మార్కెట్ ప్రీమియం రూ.246గా ఉంది. దీని ప్రకారం అంచనా వేసిన లిస్టింగ్ ధర రూ.1,365(రూ. 1,119 + రూ. 246). ఒక లాట్ (12 షేర్లు)పెట్టుబడికి రూ.13,428 కాగా, అంచనా లాభం రూ.2,952(మొత్తం విలువ రూ.16,380).

రెండు లాట్లు (24 షేర్లు): పెట్టుబడి రూ.26,856 కాగా, అంచనా లాభం రూ.5,904 (మొత్తం విలువ రూ.32,760).

మూడు లాట్లు (36 షేర్లు): పెట్టుబడి రూ.40,284 కాగా, అంచనా లాభం రూ.8,856 (మొత్తం విలువ రూ.49,140).

ఐదు లాట్లు (60 షేర్లు): పెట్టుబడి రూ.67,140 కాగా, అంచనా లాభం రూ.14,760(మొత్తం విలువ రూ.81,900).

కాగా, గ్రే మార్కెట్ ప్రీమియం అనేది కేవలం మార్కెట్ అంచనా మాత్రమే, అసలు లిస్టింగ్ ధర మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారవచ్చు.

ఐపీవో కేటాయింపు (Allotment Status) ఎలా చూడాలి?

1. KFin Technologies (రిజిస్ట్రార్): అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఐపీవో జాబితా నుంచి 'Jio Platforms' ఎంచుకుని మీ PAN, అప్లికేషన్ నంబర్ లేదా డీమ్యాట్ ఖాతా వివరాల ద్వారా ఫలితాన్ని చూడవచ్చు. https://ipostatus.kfintech.com/

2. BSE వెబ్‌సైట్: 'Equity' కేటగిరీని ఎంచుకుని, 'Jio Platforms' సెలెక్ట్ చేసి PAN లేదా అప్లికేషన్ నంబర్ నమోదు చేసి స్టేటస్ చూడవచ్చు.

3. NSE వెబ్‌సైట్: 'Equity & SME IPO bid details' లో సెర్చ్ చేసి పరిశీలించవచ్చు.

లిస్టింగ్ తేదీ, ఇతర సమాచారం

లిస్టింగ్ తేదీ: అక్టోబర్ 28, 2026 (ఉదయం 10 గంటలకు సాధారణ ట్రేడింగ్ ప్రారంభమవుతుంది).

సబ్‌స్క్రిప్షన్: ఈ ఐపీవో మొత్తం 22.19 రెట్లు బిడ్డింగ్ సాధించింది. (Jio Platforms IPO Listing)

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save