Global Vaartha
Date of Publish : 27/10/2026, 12:27 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌కు దసరా ఆదాయం రూ. 33.63 కోట్లు

దసరా పండుగ పర్వదినం సందర్భం గా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర వేసిన ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌కు రూ.33.63 కోట్ల ఆదాయం వచ్చినట్లు వరంగల్‌ ఆర్‌ఎం భవాని ప్రసాద్‌ తెలిపారు. టీజీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ నిర్వహించిన ప్రత్యేక బస్సు సర్వీస్‌లు విజయవంతం ఆయినట్లు పేర్కొన్నా రు. అక్టోబరు 9 నుంచి 25వ తేదీ వరకు 17 రో జుల పాటు రీజియన్‌లోని 9 డిపోల పరిధిలో 63.76 లక్షల కిలో మీటర్లు బస్సు సర్వీస్‌లు నడుపగా 61.07 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చి రూ. 33.63 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు సోమవారం వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ భావాని ప్రసాద్‌ తెలి పారు. మొత్తం ప్రయాణికుల్లో 39.98 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించు కున్నట్లు పేర్కొన్నారు.

డిపోల వారీగా ఆదాయం..

హనుమకొండ డిపో రూ. 4.25 కోట్లు, జనగామ డిపో రూ. 3.81 కోట్లు, వరంగల్‌ -1 డిపో రూ.5కోట్లు, వరంగల్‌ -2 డిపో రూ.5.74 కోట్లు, మహబూబాబాద్‌డిపో రూ.2.20 కోట్లు, నర్సం పేట డిపో రూ.2.74 కోట్లు, పరకాల డిపో రూ. 2.50 కోట్లు, తొర్రూరు డిపో రూ. 3.65 కోట్లు, భూపాలపల్లి డిపో రూ.3.69 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. పండుగ సమయంలో ఆర్టీసీ బస్సులను ఆదరించిన ప్రయాణికులను అభినందించారు.

ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగ కుండా అంకితభావంతో విధులు నిర్వహించిన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లు, డిపో మేనేజర్లకు ఆర్టీ యాజ మాన్యం తరపున ఆర్‌ఎం భవాని ప్రసాద్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save