అభివృద్ధి విషయంలో ఛాలెంజింగ్‌గా పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు (మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. క్లిష్ట పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని తెలిపారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయన్నారు. రాష్ట్రానికి స్థానిక సంస్థలు చాలా కీలకమైనవని వెల్లడించారు. సీట్ల సర్దుబాటు సవాల్ లాంటిదని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో సీట్ల సర్దుబాబు చాలా చక్కగా చేసినట్లు చెప్పారు. అందరం కూర్చుని లిస్ట్ ఫైనలైజ్ చేశామని.. తాము బీఫామ్ ఇచ్చిన వారు మాత్రమే అభ్యర్థులని స్పష్టం చేశారు. మిగిలిన వారు ఉపసంహరించుకోవాలని కోరారు.
జనసేన నుంచి తప్పనిసరిగా పార్టీ పరంగా న్యాయం చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. కూటమి స్ఫూర్తిని అర్థం చేసుకుని అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని.. కూటమికి తోడుగా నిలబడాలని నేతలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి చేసేందుకు తోడ్పాటు అందించాలని అన్నారు. సీట్ల సర్దుబాటుపై అందరికీ సర్దిచెప్పామని.. ఏకాభిప్రాయంతో ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి చూపిన ఐక్యతను మరోసారి చూపాలన్నారు.కూటమి సర్దుబాటు సమయంలోనే ఆర్నబ్ తుఫాన్ వచ్చిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంత బిజీగా ఉన్నా కూడా సీఎం తుఫాన్‌పై సమీక్షలు చేశారని అన్నారు. సంక్షోభం సమయంలో చంద్రబాబు పనిచేసే తీరు అందరికీ స్పూర్తినిస్తుందన్నారు. తుఫాన్‌పై తన పరిధిలో కూడా కొన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడినట్లు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. అడవితల్లి బాట రెండు దశలు పూర్తయ్యాయని.. రూ.3,458కోట్లతో 3,638కి.మీ. రోడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పంచాయతీరాజ్‌లో లక్షన్నర కోట్లతో అభివృద్ధి చేశామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.