Global Vaartha
Date of Publish : 27/10/2026, 12:37 pm
Editor : భవ్య జర్నలిస్ట్

స్థానిక ఎన్నికలకు ఐక్యంగా వెళ్తున్నాం: బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్

‘చెప్పాం.. చేస్తున్నాం’ అనే నినాదంతో మంచి వాతావరణంలో స్థానిక ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఈరోజు (మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. కింది స్థాయిలోనూ సమన్వయంతో సీట్లు సర్దుబాటు చేసుకుని ఎన్నికల బరిలో నిలిచామని చెప్పారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏకతాటిపైకి వచ్చామన్నారు. కూటమికి బీటలు వాలుతుందేమో అని ప్రత్యర్థుల ఆశలకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. కూటమి ఐక్యతతోనే సూపర్ ఎల్‌నినోతో పాటు ఎన్నో సవాళ్లు అధిగమించి సుపరిపాలన అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save