Global Vaartha
Date of Publish : 27/10/2026, 12:49 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. కోనసీమలో 400 మంది మత్స్యకారుల తరలింపు

కోనసీమలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత వలస మత్స్యకారులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈరోజు తీర ప్రాంతాల్లో ఆర్డీవో సరళ దేవి పర్యటించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఆర్డీవో తరలించారు. తుఫాన్ ప్రభావంతో కోనసీమలో వాతావరణ పూర్తిగా మారిపోయింది. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప సముద్ర తీరం వద్ద ఉన్న మత్స్యకార కుటుంబాలను ఆర్డీవో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.వేటకు వచ్చిన విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన 400 మంది వలస మత్స్యకారులను తుఫాన్ షెల్టర్లకు తరలించారు. అమలాపురం డివిజన్లో 1000 నుంచి1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా ఆర్డీవో సరళాదేవి తెలిపారు. నేటి నుంచి రెండు రోజుల పాటు స్కూళ్లకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సెలవులు ప్రకటించారు. జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save