Global Vaartha
Date of Publish : 27/10/2026, 1:02 pm
Editor : భవ్య జర్నలిస్ట్

బాలెనె డి ఓర్ అవార్డు: ఈ విజయానికి అర్హుడివి.. హ్యారీ కేన్‌‌కు కోహ్లీ స్పెషల్ విషెస్!

ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక బాలర్ డి ఓర్ పురస్కారాన్ని గెలుచుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్‌కు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభినందనలు తెలిపాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టాడు. ఎన్నో ఏళ్ల కష్టానికి, పట్టుదలకు, నిలకడైన ప్రదర్శనకు తగిన గుర్తింపు లభించిందంటూ కేన్‌పై ప్రశంసలు కురిపించాడు.‘హ్యారీ.. మై డియర్ ఫ్రెండ్! బాలన్ డి ఓర్ పురస్కారం అందుకోవడానికి నువ్వు అర్హుడివి. ఆటలో చూపించిన పట్టుదల, కష్టం, నిజాయతీ.. ఇవన్నీ నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నీ విజయం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చల్లగా చూడాలి. నీ కుటుంబ సభ్యులంతా నిన్ను చూసి ఎంతో గర్వపడుతూ ఉంటారు. నువ్వు కూడా నీ ప్రయాణం పట్ల గర్వపడాలి. శుభాకాంక్షలు మిత్రమా!’ అని కోహ్లీ ఎక్స్‌లో పేర్కొన్నాడు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save